భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు తీరని శోకం మిగిల్చాయి. ఇవాళ సెన్సెక్స్ 1,020 పాయింట్లు, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోవడంతో.. రూ.4.90 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 30 షేర్లలో 3 మాత్రమే లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీరేట్ల పెంపు, కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను RBI పెంచనుందనే అంచనాలు, దేశ వృద్ధిరేటు అంచనాల కుదింపు స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.