నెయ్యి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దేశీ నెయ్యి తీసుకోవడం వల్ల వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి నెయ్యి చాలా సహాయపడుతుంది. నెయ్యి కణాలు మరియు కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యానికి నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది.