జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో ఉత్పత్తి పెరిగినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. మొత్తం 6 యూనిట్లలో 1, 650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 6 యూనిట్లలో కలిసి సుమారు 1, 400 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. గత నెల రోజులుగా కీలకమైన 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6వ యూనిట్లో సమస్య ఏర్పడటంతో ఉత్పత్తిని నిలివేయడం జరిగింది. ట్యూబుల లీకేజీతో సోమవారం మొదటి యూనిట్లో ఉత్పత్తిని నిలిపివేశారు. బుధవారం నిలిపివేసిన రెండు యూనిట్లను సర్వీస్‌లోకి తీసుకోవడంతో ప్రస్తుతం 1, 400 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది.