వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్ అండ్ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. పది ఫ్రాంచైజీలు తమ హోమ్ గ్రౌండ్లో సగం మ్యాచులు ఆడతాయని ప్రకటించారు. మిగతా మ్యాచులు ప్రత్యర్థి మైదానాల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు.