ఎంతో ఆవసరత కలిగిన రహదారి నుంచి నెల్లూరు ప్రవేశానికి ప్రధాన ద్వారం వద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని జాప్యం చేస్తూ, ఇప్పటికీ లేదు అని తప్పించుకుంటున్న వైసీపీ MLA ల అసమర్ధతను నిరసిస్తూ,మెడికవర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద బాక్స్ టైపు బ్రిడ్జి ఆవశ్యకతను తెలియజేస్తూ జనసేన నాయకులూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మాట్లాడుతూ... వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాంతానికి బ్రిడ్జ్ అత్యవసరం. అహైవే నుంచి నెల్లూరు కి ప్రధాన ద్వారంగా ఉన్న ఈ హైవే చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్లో బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటి దాకా మీ హయాం లో మరియూ ఇప్పటి నుండి పోయే ప్రాణాలను బలిగొన్న ఉసురు మీకు తగులుతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తెప్పించుకోలేక పోయిన MLA లు. ఇప్పటికైనా ఈ సెంటర్లో అవసరమైన బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకతను తెలుసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రజల బాధ్యత మరచిన ఈ వైసీపీ నాయకులకు తమ జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తూ ఈ రోజు జనసేన పార్టీ తరఫున మెడికవర్ బ్రిడ్జి జంక్షన్ వద్ద బ్రిడ్జి టైపు బాక్స్ టైపు బ్రిడ్జి నిర్మించాలంటూ జనసేన నిరసన తెలియజేస్తున్నాం అని నిరసనలు తెలియజేసారు.