కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయమునకు దిశా మొబైల్ రెస్ట్ రూమ్ వాహనము ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ జిల్లా కలక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎం.పి. శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ రూరల్ యం.ఎల్.ఏ. శ్రీ K. కన్నబాబు గార్లు జిల్లా ఎస్.పి. శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబుగారి కోరిక మేరకు కాకినాడ లో రహదారి భద్రత అంశంపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బముగా ట్రాఫిక్ విభాగము వారు తయారు చేసిన ఒక సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను అందరూ వీక్షించడం జరిగినది. కాకినాడ సిటి మరియు రూరల్ ప్రాంతాలలో సిగ్నల్ లైట్స్ అవసరమయిన చోట్ల గురించి, మెయిన్ రోడ్ లో వాహనాల పార్కింగ్ స్లాట్స్, అప్ప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్, రోడ్ల పై వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలు, ప్రధాన కూడలిలలో వాహన రాక పోకలకు ఫ్రీ లెఫ్ట్ కొరకు స్ప్రింగ్ పోస్ట్ ఏర్పాటు, షాపింగ్ కాంప్లెక్స్లలో సెల్లార్ పార్కింగ్, దేవాలయం వీధిలో ప్రారంభించిన కొత్త బ్రిడ్జి ద్వారా భారీ వాహనాలు పట్టణములోనికి ప్రవేశించకుండా ఐరన్ గడ్దర్ ఏర్పాటు గురించి ఈ సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగింది. కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారికి, ట్రాఫిక్ నియంత్రణకు గాను ఇటీవల కొనుగోలు చేసిన సుమారు రూ.4,40,000- విలువ గల ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎక్విప్మెంట్ ను కూడా పరిశీలించడం జరిగింది.