హర్యానాలో ఇటీవల దారుణం జరిగింది. స్థానిక మహిళ(45)ను నిందితులు కిడ్నాప్ చేసి, రాజస్థాన్ తీసుకెళ్లారు. అక్కడ 36 రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దారుణాన్ని వీడియో తీసి, ఆన్లైన్లో పెడతామని బెదిరించారు. దీంతో బాధిత మహిళ కుటుంబికులు రూ.3 లక్షలు చెల్లించి, ఆమెను విడిపించారు. దీనిపై నూహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా తాజాగా స్పందించారు. కేసు నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.