రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైయస్ఆర్ అచీవ్మెంట్–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన హైపవర్ స్క్రీనింగ్ కమిటీ విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రేవు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు.