ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ బాంబు దాడితో రక్తమోడింది. ఓ మసీదు సమీపంలో ఉంచిన కారులో దుండగులు బాంబు అమర్చారు. ప్రార్థనలు పూర్తైన తర్వాత ప్రజలు మసీదు నుంచి వస్తుండగా శుక్రవారం బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 41 మంది గాయపడ్డారు. అందులో చిన్నారులు కూడా ఉండడం అందరినీ కలచి వేస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa