తిరుపతి మంచినీళ్ళ కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శనివారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు. తిరుపతి మంచినీళ్లు కుంటలో సుమారు 55 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి నీళ్లలో తేలాడుతూ కనిపించడాన్ని స్థానికులు గుర్తించారు, వెంటనే సచివాలయ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మంచి నీళ్ల కుంట వద్దకు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించారు. అతని ఆచూకీ లభించకపోవడంతో చేసేదిలేక మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గుత్తి తెలియని వ్యక్తిది అని మనస్ఫూర్తి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.