సత్యవేడు మండలం పెద్దఈటిపాకం గ్రామంలో శుక్రవారం చిన్నారి దీపిక విద్యుత్ షాక్‌కి గురైంది. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇంటిపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ లైన్ తగిలి దీపికకు చేయి కాలిపోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్స అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు మేల్కొని జగనన్న కాలనీపై వెళుతున్న విద్యుత్ తీగలను తొలగించాలన్నారు.