అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటకు చెందిన మహిళకు అనంతపురానికి చెందిన రఫీ(45)తో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కలిగిన అనంతరం కుటుంబంలో మనస్పర్థలు రావడంతో ఆమె నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. కట్నం కోసం భర్త తరచూ వేధించేవాడని శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్లు కురబలకోట పోలీసులు తెలిపారు.