శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన సుధాకర్ శుక్రవారం రాత్రి ఓ ఏటీఎం కేంద్రానికి వెళ్లి నగదు డ్రా చేసి ఇవ్వమని ఓ యువకుడిని కోరాడు. అతను పాస్వర్డ్ తెలుసుకున్న తరువాత సుధాకర్ కార్డును మార్చి వేరే కార్డు ఇచ్చాడు. అనంతరం సుధాకర్ ఖాతాలో రూ. 25వేలు మళ్లీ డ్రా చేశాడు. మెసేజ్ రావడంతో బాధితుడు గుర్తించి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అంజుయాదవ్ కేసు నమోదు చేసి ఏటీఎంను పరిశీలించారు.