శ్రీకాళహస్తి పట్టణంలోని సీతాలమ్మ ఆలయంలో 26 నుంచి పది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికోసం ఆలయం పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల కోసం పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు. అలాగే రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. పది రోజులు పాటు ప్రముఖులతో సాంస్కృతి కార్యక్రమాలు, అమ్మవారు 9 రోజులు తొమ్మిది అలంకరణలతో దర్శనమిస్తారని ఆలయ కమిటీ తెలిపింది.