ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి సీఎం జగన్ దుష్ట సంప్రదాయానికి తెరతీసారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండపడ్డారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. అంబేద్కర్ పేరుతో విదేశీ విద్యను టిడిపి అధినేత చంద్రబాబు ప్రవేశపెడితే దానికి వైయస్సార్ విదేశీ విద్య అంటూ జగన్ పేరు మార్చడం దారుణమన్నారు.