నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై వార్ ఏకపక్షంగా నిలిచింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో భారత్ చెలరేగిపోయింది. మొదట బౌలింగ్, తర్వాత బ్యాటింగ్ లో భారత్ చెలరేగిపోయింది. రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్లు భారత్‌ను తీశారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. చివర్లో దినేష్ కార్తీక్ తనదైన శైలిలో ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఎనిమిది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ 20 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఛేదించింది. రోహిత్ శర్మ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ విన్నింగ్ షాట్ చేశాడు. మరోసారి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. రెండు బంతులు ఎదుర్కొన్న డీకే 10 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దినేశ్ కార్తీక్ మాట్లాడారు. బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఇంటర్నేషనల్స్‌లోనూ ఫినిషింగ్ చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.