ఎఫ్‌బీఐ అధికారులతో తరచూ తన ఇంటిపై దాడులు చేయిస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ టెర్రరిస్టును కాదన్నారు. నార్త్ కరోలినాలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. తనను, తన మద్దతుదారులను దేశీయ ఉగ్రవాదులుగా ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. తమపై వేధింపులను మర్చిపోనని పేర్కొన్నారు.