ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మార్పు చెందుతూ వస్తోంది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఏపీ తీరం మీద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఏపీలో రాబోవు మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో భారీ ఈదురగాలులు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.