గ్రామీణ అక్కచెల్లమ్మల జీవితాలలో సుస్థిర జీవనోపాధి ని కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశ పెట్టిన వై ఎస్సార్ చేయూత మహిళలకెంతో మేలు చేస్తున్నదని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(డిఎన్నార్ ) అన్నారు. శనివారం ముదినేపల్లి మండల ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో సింగరాయిపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన వైస్సార్ చేయూత 3 విడత కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డిఎన్నార్ మాట్లాడుతూ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఈ మూడో విడత చేయూత నగదు జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారనన్నారు. దానిలో భాగంగా మండలాల వారీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ముదినేపల్లి మండలంలోని 3848 మంది అక్క చెల్లెమ్మలకి నేరుగా వారి బాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మాట ఇచ్చిన మొత్తాన్ని చెప్పిన తేదీకి నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తూ అవినీతి రహిత సంక్షేమ రాజ్యాన్ని సీఎం జగనన్న సాధించారన్నారు.