మరోసారి తమ కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక జారీ చేసింది. సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, అటువంటి పరిస్థితిలో ఎలాంటి బ్యాంకింగ్ మోసం జరిగినా వెంటనే తమకు తెలియజేయాలని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా వెల్లడించారు. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే, టోల్ ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలని కోరారు. తమకు ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు.