ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తాడేపల్లికి వచ్చేస్తున్నాయి. ఇటీవల మెప్మా కార్యాలయం కుంచనపల్లిలో ఏర్పాటు చేశారు. త్వరలో అటవీశాఖ కార్యాలయం రాబోతోంది. ఎక్జిక్యూటివ్ కాపిటల్ విశాఖ అవుతోందని చెబుతున్న సీఎం ఇంటి దగ్గరలోనే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఇప్పటికే విజయవాడ- గుంటూరు హైవేపై పంచాయతీరాజ్, స్కిల్ డెవలప్మెంట్ తో పాటు కాపు కార్పొరేషన్ ఎస్సీ,ఎస్టీ అనుబంధ విభాగాల కార్యాలయాలున్నాయి.