కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ఎంపీ శశిథరూర్ రెడీ అయ్యారు. ఈ రోజు ఆయన నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. దీంతో అధ్యక్ష పదవికి అధికారికంగా పోటీలో దిగిన మొదటి వ్యక్తిగా శశిథరూర్ నిలిచారు. మరోవైపు ఆయన పోటీకి సోనియాగాంధీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాజస్థాన్సీఎం అశోక్ గెహ్లాట్ పోటీలో ఉంటానని ప్రకటించారు. రాహుల్ గాంధీ తప్పుకున్నట్లు చెప్పడంతో ఇతరులు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.