అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర గుడివాడ పట్టణంలోని శరత్ టాకీస్ సమీపానికి చేరుకోగానే రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా థియేటర్ వద్ద ఉన్న వైసీపీ అభిమానులు జై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ వర్గాలకు సర్ది చెప్పి అక్కడనుంచి పంపివేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.