ఉత్తరాఖండ్ మాజీ మంత్రి,బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్యకు పౌరీ జిల్లాల్లో రిసార్ట్ ఉంది. ఇందులో అంకితా భండారి అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్ గా పని చేస్తుంది. యువతిని వ్యభిచారం చేయాలంటూ పుల్కిత్ ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించడంతో పుల్కిత్ హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన పట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పుల్కిత్ తో పాటు హత్యకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.