జింఖానా గ్రౌండ్స్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన దేశ రక్షణ భేరి సభ విజయవంతంగా ముగిసింది. ఈ సభలో జిల్లా నలుమూలలా నుంచి వేలాదిగా సీపీఎం పార్టీ నాయకులు, CITU, DYFI, SFI, AIDWA, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి మోదీ తన నియంతృత్వ నిర్ణయాలతో చాలా నష్టం చేశారని, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదంటూ మండిపడ్డారు.