పరిపాలనా వికేంద్రీకరణపై వైసీపీ ఆదివారం విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. రాజకీయ ఎజెండాతో జరుగుతున్న అమరావతి-అరసవిల్లి పాదయాత్రపై ఈ సమావేశంలో చర్చిస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఈ సమావేశం తరువాత పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరే . నేతలందరూ ఈ సమావేశానికి రావచ్చని తెలిపారు. అల్లర్లు సృష్టిస్తామని భావించేవారు రావద్దని చెప్పారు.