బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం చేపట్టిన 'దేశ రక్షణ భేరి ' బహిరంగ సభ జింఖానా గ్రౌండ్స్ లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిందని.. కానీ అన్ని రంగాల్లోనూ ఇలాంటి సంక్షోభం ఎన్నడూ చూడలేదన్నారు. ఏ రాజ్యాంగం ఆధారంగా మోదీ ప్రధాని అయి పరిపాలన సాగిస్తున్నారో అదే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు.