విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సోమవారం నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9గంటల నుండి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి రోజు తెల్లవారుజామున 3గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు అమ్మవారి దర్శనభాగ్యాన్ని పొందేలా దేవదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతరాలయ దర్శనాన్ని శరన్నవరాత్రులు సందర్భంగా రద్దు చేశారు.