ఏపీ లోని స్కూళ్లకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 6 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అయితే నాడు-నేడు పనులు జరుగుతున్న స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు దసరా సెలవుల్లోనూ స్కూళ్లకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. సెలవుల్లో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఉండాలని.. యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. సెలవుల్లోనూ రమ్మనడంపై HMలు అసంతృప్తికి గురవుతున్నారు.