కోవెలకుంట్ల: వైఎస్సార్ చేయూత సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమవారం సంజామల మండలానికి వస్తున్నట్లు ఎంపీపీ పోచా రమాదేవి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని 11 గ్రామ సచివాలయాల పరిధిలో 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 2, 245 మంది లబ్దిదారులకు మూడవ విడతలో రూ. 4. 20 కోట్లు విడుదలయన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటసాని హాజరవుతారని అన్నారు.