నంద్యాల పట్టణంలోని ఉప్పరి వీధిలో మొదటిసారిగా దసరా శరన్నవరాత్రి సందర్భంగా భక్తులు దుర్గా మాత విగ్రహాన్ని నెలకొల్పారు. దుర్గతులను నాశనం చేసే రూపమే దుర్గాదేవి రూపమని, దుర్గముడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది కాబట్టి దేవిని దుర్గగా పిలుస్తారని డాక్టర్ ఇమ్మడి అపర్ణ తెలిపారు. తొలిసారిగా ప్రతిష్టించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు, కాలనీ వాసులు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.