రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలోని ఓ స్కూల్ లో సోమవారం కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు స్కూల్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్కూల్ పై దాడి జరిగిన సమయంలో 1000 మంది స్టూడెంట్స్, 80 మంది టీచర్లు ఉన్నారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు ఆత్మహత్య చేసుకొన్నట్లు రష్యా మీడియా సంస్థలు వెల్లడించాయి. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.