ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం కనిపించింది. అధికారులు జారీ చేసిన పాస్‌లతో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నప్పటికీ మహా మండపం ప్రవేశ మార్గంలో పోలీసులు అడ్డుకోవడం పట్ల జర్నలిస్ట్‌లు ఆగ్రహం వ్యక్తం చేసి కొద్దిసేపు అక్కడే నిరసన తెలిపారు.