గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక 42వ డివిజన్ లోని 130వ సచివాలయం పరిధిలో పర్యటించారు. భవానిపురం స్వాతి రోడ్, లలిత నగర్, టెలిఫోన్ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ నాయకులు అధికారులు సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఈ ప్రాంత ప్రజలందరికీ అమరావతి లో ఇళ్ళ స్థలాల ఇవ్వడం జరిగిందని కోర్టు తీర్పు రాగానే ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అగ్రవర్ణ పేదలకు ఈబిసి నేస్తం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. ఈ ప్రాంతంలో చాలా మందికి ఈబిసి వచ్చిందన్నారు. రైతు బజార్, పార్కులు రోడ్లను అభివృద్ది చేశామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడపాటి చైతన్య రెడ్డి, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |