దేవీ శరన్నవరాత్రుల్లో తొలి రోజు ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పలు రకాల పూలతో అమ్మవారి గర్భాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.