మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలని సీఎం జగన్ అన్నారు. బాల్య వివాహాల నివారణలో కళ్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని సీఎం జగన్ అన్నారు. అందుకనే కళ్యాణమస్తు పథకం లబ్ధిదారైన వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామని సీఎం జగన్ తెలిపారు.