దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశంలో 3,230 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో 4,255 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 42,358కు తగ్గిపోయింది. కరోనా డైలీ పాజిటివిటీ రేటు 1.18 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.