చీటీ పాటల నిర్వాహకురాలు తమను రూ. 50 లక్షలకు మోసం చేసిందని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నల్లచెరువు 9వ లైనుకు చెందిన అరుణ సుమారు 8 ఏళ్లుగా చీటీ పాటలు నిర్వహిస్తుందన్నారు. తాను ఆమె వద్ద చీటీలు వేయగా గత నవంబరు లోనే పాటలు ముగిశాయని అనుష పేర్కొన్నారు. తనకు రూ. 10 లక్షలు రావాల్సి ఉండగా ఇవ్వడం లేదన్నారు. అలాగే మరో ఐదుగురు కూడా రూ. 50 లక్షల వరకు రావాల్సి ఉందని ఫిర్యాదు చేశారు.