త్వరలో పనులు ప్రారంభించనున్న కడప రేణిగుంట నేషనల్ హైవే వలన రోడ్డు విస్తరణలో భాగంగా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపాన సుమారు 50 కుటుంబాల వారు ఇండ్లు కోల్పోతున్నారు. వారికి పునరావాసం స్థలం పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిందిగా మంగళవారం రెవెన్యూ అధికారులను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్ మోహన్, కుక్కలదొడ్డి సర్పంచ్ రమణ, ఎంపిటిసి జనార్ధన్ రాజు, రాజేంద్ర మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.