రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ ఎం. శివప్రసాదరెడ్డి తెలిపారు. పమిడిముక్కల సబ్ స్టేషన్లో వైస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులకు జరిగిన అవగాహన సదస్సులో ఎస్ఈ పాల్గొని మాట్లాడారు. రైతుకు నాణ్యమైన ఉచిత విద్యుతను హక్కుగా అందించడంమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. రైతులకు పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్నా మని, రైతు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నగదు బదిలీ ర్వారా రైతు బ్యాంక్ ఖాతాలో వేస్తుందన్నారు. ఆ ఖాతా ద్వారా బిల్లుల మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు రైతు చెల్లిస్తారని చెప్పారు.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిం చడం వలన ఎన్ని గంటలు కరెంట్ వస్తుంది, ఎంత నాణ్యమైన కరెంట్ వస్తుందో, ఎంత వాడు తున్నారో తెలుస్తుందన్నారు. రావల్సిన ఓల్టేజి వస్తుందో, లేదో తెలుస్తుందని, ఒక్క పైసా కూడా అన్నదాత కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకొని, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ పథకంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, సచివాలయాల్లో సమాచారం అందుబాటులో ఉం చాలని సిబ్బందిని ఆదేశించారు. పమిడిముక్కల సబ్ స్టేషన్ పనితీరు బాగుందని ప్రశంసించారు. ఏడీఈ సుందరరావు, ఏఈ శ్రీనివాసరావు, సిబ్బందీని ప్రత్యేకంగా అభినందించారు.