గుంటూరు: మేడికొండూరు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మేడికొండూరు మండలంలోని 3, 245 మంది సభ్యులకు 3వ విడతలో 'వైఎస్సార్ చేయూత ' కింద రూ. 6. 08 కోట్లు మంజూరయ్యిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు పసువు - కుంకుమ పేరుతో మభ్యపెట్టడానికి చూశారన్నారు.