సీఎం జగన్ కి ఏపీపీటీడీ వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను పీటీడీ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఏపీపీటీడీగా మార్చడంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలన్నీ ఏపీపీటీడీ ఉద్యోగుకు కల్పిస్తున్న ప్రభుత్వం, అలాగే పదవీ విరమణ వయస్సు కూడా 62 సంవత్సరాలకు పెంపు, కొత్త పీఆర్సీ ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచి పెరిగిన జీతాలు పీటీడీ ఉద్యోగులకు చెల్లించనున్న ప్రభుత్వం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, పీటీడీ వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చల్లా చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్‌పీ రావు, రాష్ట్ర నాయకులు ఎ.రాధాకృష్ణ, డి.ఏడుకొండలు పాల్గొన్నారు.