ఆకాశంలో రేపు మరో అద్భుతం జరగనుంది. బృహస్పతి, బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్‌గా సైంటిస్టులు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం స్పష్టంగా ఉంటే పశ్చిమం వైపున బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడవచ్చు. యురేనస్, నెప్ట్యూన్లను బైనాక్యులర్లు/టెలిస్కోప్ వీక్షించవచ్చు.ఇవి తమ తమ కక్ష్యల్లో తమకు తగిన వేగంతో తిరుగుతుంటాయి. బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంగా ఉండి కేవలం 88 రోజుల్లో ఒకసారి తిరుగుతాడు. శుక్రుడు 225 రోజులు, భూమి 365 రోజులు, అంగారకుడు 687 రోజులు తీసుకుంటాయి. ఇక గ్యాస్ జెయింట్స్ అయిన బృహస్పతి 12 సంవత్సరాలు, శని 29.5 సంవత్సరాలు, యురేనస్ 84 సంవత్సరాలు, నెప్ట్యూన్ 165 సంవత్సరాలు తీసుకుంటాయి. ఈ విభిన్న కాలాలు, దూరాలు కారణంగా గ్రహాలు ఒకే లైన్‌లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది.గ్రహాలు పూర్తిగా ఒకే సూటి గీతలో నిలబడటం వాస్తవంగా జరగదు. కానీ భూమి నుంచి చూసినప్పుడు అవి ఒకే దిశలో, ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ పరిస్థితినే “సిజిగీ” అంటారు. సాధారణంగా రెండు లేదా మూడు గ్రహాలు ఒకే లైన్‌లో కనిపించడం సాధారణమే. కానీ ఐదు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకేసారి వరుసలో కనిపించడం మాత్రం చాలా అరుదైన సంఘటన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa