గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని (ఏయూ) పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా 'మ్యాన్‌పవర్ ఆడిట్' నిర్వహిస్తామని, 30 రోజుల్లో నివేదిక తెప్పించుకుని అనర్హులపై వేటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఇవాళ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్.. ఏయూలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కాంట్రాక్ట్, రోజువారీ వేతన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో వర్సిటీల్లో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా నియమించుకున్నారని, ఈ అక్రమాలపైనే మ్యాన్‌పవర్ ఆడిట్ చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆడిట్ పూర్తయ్యాక, ఆర్థిక శాఖతో చర్చించి ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa