2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కందుల దుర్గేశ్, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను ఆరు జిల్లాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి, మొత్తం 369 స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో ఈ ఏర్పాట్లు జరగనున్నాయి.భక్తుల కోసం సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa