పెద్ద సైకో జగన్ రెడ్డి అండ చూసుకొని గ్రామాల్లో వైసిపి పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు అని నారా లోకేష్ మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్ళితే.... కనిగిరి నియోజకవర్గం, వెలిగండ్ల మండలం, మొగళూరు గ్రామంలో ఐటిడిపి కోఆర్డినేటర్, బిసి యువకుడు నరేంద్ర పై సర్పంచ్ భర్త కోటేశ్వర రావు, అనుచరులు కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానిక వాసులు తెలియజేసారు. దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ.... ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నరేంద్ర పై దాడి చేసిన కోటేశ్వర రావు, అనుచరులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. నరేంద్రకు, ఆయన కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.