ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచుతోంది. బుధవారం ఉదయం మరొకరిని అరెస్ట్ చేసింది. ఇండోస్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు ని ఈడీ బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్టు చేసింది. రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు కలిసి రూ.2.30 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో మంగళవారం ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ సీఈఓ విజయ్ నాయర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.