ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామములో క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నందు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గౌరవ హై కోర్టు వారి యొక్క ఆదేశాలపై నిన్న అనగా 27.09.2022 వ తేది నాడు ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ పాల రాజు ఐపియస్ , ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు, నూజివీడు డిఎస్పీ బి శ్రీనివాసులు గారు,నూజివీడు సీఐ అంకం బాబు గారు, ఆగిరిపల్లి ఎస్ఐ చంటి బాబు గారు మరియు ఇతర విభాగాలలో అధికారులతో సదరు క్వారీ ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేసినారు. అలాంటి చర్యలకి ఎవరు పాల్పడిన అరెస్ట్ చెయ్యడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది అని ఈ సందర్భంగా హెచ్చరించారు.