విజయవాడ నగరంలో జరుగుతున్న శ్రీదుర్గామళ్లేశ్వరస్వామి వార్ల దసరా మహోత్సవాలలో మొదటి రోజు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన వృద్ధులు మరియు వికలాంగులు పడిన ఇబ్బందులను గమనించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ శ్రీకాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. జిల్లా యంత్రాంగం తో కలిసి వారికోసం వీల్ చైర్లను అదనంగా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నగర పోలీస్ కమీషనర్ గారు దసరా మహోత్సవాలకు వచ్చిన వృద్దులు మరియు వికలాంగులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఏర్పాటు చేయబడిన సిబ్బందితో నగర పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన వృద్ధులు మరియు వికలాంగులకు సేవ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా వారికి సహకరించాలని, దర్శనం అనంతరం వారు ఆనందోత్సవాలతో వారి ఇంటికి వెళ్ళే విధంగా ప్రేమపూర్వకంగా నడుచుకోవాలని ప్రత్యేక సూచనలు సలహాలు అందించడం జరిగింది. నగర పోలీస్ కమీషనర్ గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ అమ్మవారి దర్శనానికి వచ్చిన వృద్ధులను మరియు వికలాంగులను త్వరితగతిన వీల్ చైర్ ద్వార తీసుకువెళ్ళి వారికి అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా సహకరిస్తూ సేవ చేయడం, జరుగుతుంది. నగర పోలీస్ కమీషనర్ గారు ప్రత్యేకించి వృద్ధులు మరియు వికలాంగులు కోసం చేసిన ఏర్పాట్లపై దర్శనానికి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేసినారు.