విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని వైసీపీ , ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... . కేంద్ర ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలో రైల్వేజోన్ ప్రస్తావనే రాలేదని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాలని, కుల ప్రాతిపదికన ముందుకెళ్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ప్రజలెవరూ నమ్మరని, ఈ రెండు పత్రికలు రాసే అవాస్తవాలను నమ్మొద్దని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైల్వేజోన్ వందశాతం వచ్చి తీరుతుందని, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలు అవాస్తవం అని తేలితే.. రామోజీరావు, రాధాకృష్ణ క్షమాపణ బహిరంగంగా చెబుతారా..? అని ప్రశ్నించారు. రైల్వేజోన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసిన అభూత కల్పనలపై ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.